- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదేనా సామాజిక దూరం.. ?
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఒక వైపు రోజూ వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరో వైపు కరోనా మృదంగం చేస్తుంది. ఇటు ఫ్రంట్ లైన్ వారియర్స్ నిరంతర పోరాటం చేస్తున్నారు. సామాజిక దూరం పాటించండని ప్రభుత్వం మొత్తుకుంటుంది అయినా సామాన్య ప్రజల్లో మాత్రం మార్పు కనిపించకపోవడం దారుణం. అటు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న జనాలతోపాటు ప్రయాణాలు సాగించే వారు కూడా సామాజిక దూరాన్ని పూర్తిగా మరిచిపోయారు. బస్సులో ప్రయాణించే ప్రయాణికుల సామాజిక దూరానికి సంబంధించి ప్రభుత్వం తగు మార్గదర్శకాలు జారీ చేసిన విషయం విధితమే. కానీ, కొంతమంది ప్రయాణికుల నిర్లక్ష్యం, ఆర్టీసీ కార్మికుల అలసత్వం వల్ల దానికి గండి పడుతుంది. గురువారం నాడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ కు వెళ్లే బస్సులో ఎలాంటి సామాజిక దూరాన్ని పాటించకుండా ప్రయాణికులు ప్రయాణించారు. ఒక్కో సీట్లో ఇద్దరు, ముగ్గురు కూడా కూర్చున్నారు. కరోనాను నియత్రించాల్సిన ఆర్టీసీ సిబ్బంది కూడా తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ తో పాటు ప్రైవేట్ వాహనాలు, ఆటోల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా చోట్లలో ప్రజలు గుంపులుగుంపులుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కరోనా విజృంభిస్తున్నా ఇలాంటి పరిస్థితులు వల్ల కరోనా మరింత విజృంభించే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.