100 రోజుల నుంచి అక్కడ ఒక్క కరోనా కేసు లేదు

by Sujitha Rachapalli |
100 రోజుల నుంచి అక్కడ ఒక్క కరోనా కేసు లేదు
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతుంటే.. ఒక్క చోట మాత్రం అసలు కరోనా పేరే వినిపించడం లేదు. కరోనా మహమ్మారిని పూర్తిగా కట్టడిచేసి ఇతర దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.. ఆ దేశమే న్యూజిలాండ్. 100 రోజులుగా ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేదని అక్క‌డి వైద్యాధికారులు తాజాగా వెల్లడించారు. అయితే ఇటీవ‌ల విదేశాల నుంచి వ‌చ్చిన 23 మందికి క‌రోనా ఉన్న‌ట్లు గుర్తించారు. ప్రస్తుతానికి వారు చికిత్స తీసుకుంటున్నారు.

న్యూజిలాండ్ జ‌నాభా మొత్తం క‌లిపి 50 ల‌క్ష‌లు కాగా, ఆ దేశ ప్రజలు కరోనాను విజయవంతంగా జయించారు. జనవరి, ఫిబ్రవరిలో అన్ని దేశాలకు కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చినట్లే.. న్యూజిలాండ్‌‌ను కూడా తాకింది. అక్కడ మొత్తంగా 1219 కేసులు నమోదయ్యాయి. దీంతో న్యూజిలాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే విదేశాల నుంచి వ‌చ్చేవారికి గేట్ల‌ను మూసేసింది. ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్‌ల‌ు ధ‌రించడంతో పాటు భౌతిక దూరం నిబంధ‌న‌ను కఠినంగా అమలుచేశారు. విదేశాల నుంచి వ‌చ్చే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ చేశారు. అందువ‌ల్లే అక్క‌డ కరోనా ప్ర‌భావం పూర్తిగా త‌గ్గింది. ఈ మేరకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా న్యూజిలాండ్‌ను ప్ర‌శంసించింది. అంద‌రూ ఆ దేశ మోడ‌ల్‌ను ఆద‌ర్శంగా తీసుకుని కరోనా క‌ట్ట‌డికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చింది. ఇక తాజాగా 100 రోజుల నుంచి అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇది చాలా గొప్ప విషయమని హెల్త్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ యాష్లే బ్లూమ్‌ఫీల్డ్ తెలిపారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed