క్రిప్టోకరెన్సీపై ఆర్‌బీఐ వైఖరిలో మార్పులేదు : గవర్నర్ శక్తికాంత దాస్!

by Harish |
RBI Governor Shaktikanta Das
X

దిశ, వెబ్‌డెస్క్: క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఆందోళనల గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తి కాంత దాస్ తెలిపారు. పాలసీ కమిటీ సమావేశం నేపథ్యంలో మాట్లాడిన ఆయన.. డిజిటల్ కరెన్సీ విషయంలో ఆర్‌బీఐ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, క్రిప్టోకరెన్సీ వ్యాపార సేవల విషయంలో ఇప్పటికే పలు బ్యాంకులు వినియోగదారులకు హెచ్చరించాయని, దీనికి ఆర్‌బీఐ సైతం స్పష్టత ఇచ్చినట్టు దాస్ వెల్లడించారు. ‘క్రిప్టో కరెన్సీపై తమకు ఆందోళనలు ఉన్నాయి. దీని గురించి ప్రభుత్వానికి తెలిపాఉ. డిజిటల్ కరెన్సీలో ఇన్వెస్ట్ చేసే పెట్టుబడిదారుల సలహాలకు సంబంధించి ఆర్‌బీఐ ఎలాంటి పెట్టుబడి సలహాలను ఇవ్వదు. ప్రతి పెట్టుబడిదారు దానికి సంబంధించి స్వయంగా జాగ్రత్తలు తీసుకోవాలని, జాగ్రత్తగా ఉండటం అవసరమని’ దాస్ వివరించారు. క్రిప్టోకరెన్సీ విషయంలో ఆర్‌బీఐ మే 31న ఓ సర్క్యులర్ జారీ చేర్సిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed