- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుట్కా తయారయ్యేది ఇక్కడే.. కానీ, నో యాక్షన్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా గుట్కా తయారీ, రవాణా, విక్రయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది. దశాబ్దాలుగా నిజామాబాద్ నగరం తంబాకు ఉత్పత్తుల తయారీకి అడ్డాగా ఉంటున్నది. పట్టణంలోని కొంత మంది తంబాకు ఉత్పత్తుల తయారీని వ్యాపారంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తున్నది. స్థానికంగా కొంతమంది గుట్కా, అంబర్, పాన్ మసాల దందాలో వారు ఆరి తేరారు. జిల్లా కేంద్రంలో బోధన్ రోడ్డు, ఆటోనగర్‌తో పాటు సారంగపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో కొన్నిమూతబడ్డ ప్యాక్టరీలలో నిషేధిత గుట్కా తయారు అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిజామాబాద్, బోధన్ తో పాటు పోరుగు రాష్ట్రాలైన మహరాష్ర్ట, కర్నాటకలలోని ప్యాక్టరీలలో తయారు అయిన గుట్కాను సరిహద్దులను దాటించి నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్‌తో పాటు హైద్రాబాద్ కు ఆక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తున్నది. దేశంలో, రాష్ర్టంలో నిషేధిత పోగాకు, పాన్ మసాల ఉత్పత్తులకు కొరత ఎర్పడినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు అటువంటి పరిస్థితి తెలెత్తలేదు. దీన్ని బట్టి ఇక్కడ గుట్కా ఉత్పత్తులు ఎంత ఆక్టీవ్ సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
గుట్కా దందాలో పొలిటికల్ లీడర్లు..?
నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఏడాది పోలీస్, నిఘా శాఖలు రూ.కోటి విలువ గల గుట్కా, తంబాకు పట్టుకుంటున్నట్లు అంచనా. ఈ గుట్కా దందాలో బిగ్‌షాట్‌లు ఉన్నట్లు వినికిడి. జిల్లా కేంద్రంలోని గంజ్‌లోని హొల్ సెల్ దుకాణాలతో పాటు మరి కొన్ని అడ్డాలల్లో గుట్కా దాస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నగర శివారులోని కొన్ని పాంహౌజ్‌లలో కూడా గుట్కా నిల్వ చేసినట్లు సమాచారం. గుట్కా దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగడంతో పలు పార్టీల నేతలు, పాత నేరస్తులు దందా చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం పట్టణంలోని మైనార్టీ అధ్యక్షుని ఇంట్లో 4.20 లక్షల గుట్కా దొరకడంతో ఈ దందాలో పొలిటికల్ హస్తం ఉందని స్పష్టం అవుతున్నది. జిల్లాలో గుట్కా, తంబాకు తయారీ విక్రయ దారులు 2014 తర్వాత ఓ పార్టీలో చేరి ప్రధాన ఆదాయ వనరుగా గుట్కాదందాను ఎంచుకున్నట్లు సమాచారం. ఈ గుట్కా దందాలు చేసి లీడర్లుగా ఎదగటంతో వారిపై యాక్షన్ తీసుకోవడానికి పోలీసులు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
పెద్ద తలకాయలు ఎస్కేప్..
గుట్కా దందాతో సంబంధం ఉన్న బిగ్‌షాట్‌పై ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు. దందా చేసేవారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతున్నారు. గుట్కా, తంబాకు దొరికేది ఒక చోటు అయితే వేరే ప్రదేశంలో తయారు చేస్తారు. దీంతో ఎవరూ చిక్కడం లేదు. గుట్కా తంబాకు దొరకగానే ఎవరో ఒకరు తమదే అని పోలీస్‌లకు లోంగిపోవడంతో బిగ్‌షాట్ లు తప్పించుకుంటున్నారు. వారికి కేసులకు, జైలుకు అయ్యే కేసులకు అయ్చే ఖర్చులు భరించడంతో చాల మంది అనుచరులు, చోటా, మోటా వారిపై కేసులు నమోదు అవుతుండగా అసలు సూత్రదారులు తప్పించుకుంటున్నారు. దానికి తోడు వారు ప్రజా ప్రతినిధులుగా, లీడర్లుగా ఉండటంతో వారు తప్పించుకోవడం సులువు అవుతున్నది.
పోలీసుల పాత్రపై అనుమానాలు..
గుట్కా దందా గుట్టుగా సాగడంపై పోలీసుల పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి నెలా పోలీస్ శాఖలోని కొందరి మూలంగా తప్పించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ఒక్కోసారి లక్షల్లో దొరికే సరుకు వివరాలు, పట్టుబడినా సమాచారం కుడా పోలీస్, నిఘా వర్గాలు దాస్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. గుట్కా, తంబాకు దొరికిన తరువాత పోలీస్ స్టేషన్‌లలో సూత్రదారులు పైరవీలు చేయడం, స్టేషన్ బెయిల్ కోసం పనిచేయడం వరకు పరిమితం అవడంతో వారి నేర చరిత్ర బయటకు పొక్కడం లేదని చెప్పవచ్చు. ఇటీవల జిల్లా కేంద్రంలో రెండు ప్రాంతాలలో దొరికిన గుట్కా, తంబాకు సరుకుల వ్యవహరంను గుట్టుగా ఉంచేందుకు జరిగిన వ్యవహరం విమర్శలకు కారణమైంది. అదే సమయంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు తలోగ్గారని, కొన్ని విషయాలలో బేరసారాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.