ఎంపీ రఘురామపై చర్యలు తప్పవు : ఎంపీ మార్గాని భరత్

by srinivas |
MP Margani Bharat
X

దిశ, ఏపీ బ్యూరో: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసినట్లు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. రఘురామపై 290 పేజీల డాక్యుమెంట్‌ను స్పీకర్‌కు అందజేశామన్నారు. వారం రోజుల్లోనే రఘురామకు నోటీసులు వస్తాయని తాము భావిస్తున్నామన్నారు. స్పీకర్‌కు ఉన్న విచక్షణ అధికారాలతో వేటు వేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఎంపీ రఘురామ పార్టీ అధినేతకు, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన పాల్పడుతున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. గతంలో జరిగిన శరద్ యాదవ్ ఘటన కూడా స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed