ప్రభుత్వ సూచనలు పాటిస్తే కరోనా దూరం

by Aamani |

దిశ, నిజామాబాద్ :ప్రభుత్వ సూచనలు పాటిస్తే కరోనా మహమ్మారిని తరిమికొట్టొచ్చని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నగరంలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నిజామాబాద్‌లో విదేశాలు, ఢిల్లీ నుండి వచ్చిన వారి రక్త నమూనాలను సేకరించి హైదరాబాద్‌కు పంపిస్తున్నట్టు తెలిపారు. స్థానికంగా ఎలాంటి పరీక్షలు నిర్వహించటం లేదని చెప్పారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ సైతం గుర్తించి క్వారంటైన్‌కు పంపుతామని తెలిపారు. కంటైన్‌మెంట్ ఏరియాల్లో ఎవరూ బయటకి రాకుండా వాలంటీర్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రజలకు నిత్యావసరాలకు ఇబ్బంది కలగకుండా హైమది బజార్ మార్కెట్‌ను అందుబాటులో ఉంచినట్టు గుర్తుచేశారు. కంటైన్‌మెంట్ ఏరియాలో హైడ్రాక్సీక్లోరోక్విన్ పిచికారి చేస్తున్నట్టు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిత్యావసర సరుకుల దుకాణాలు ఉంటాయని చెప్పారు. మెడికల్ షాప్ లు మాత్రం 24 గంటల అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలంతా ప్రభుత్వ సూచనలు విధిగా పాటించి కరోనా నివారణకు తోడ్పడాలని కోరారు.

Tags:NIzamabad,municipal commisioner, pressmeet

Advertisement

Next Story

Most Viewed