‘వి’ ప్రమోషన్స్‌లో నివేద..

by  |
‘వి’ ప్రమోషన్స్‌లో నివేద..
X

దిశ, వెబ్‌డెస్క్: క్యూట్ గర్ల్ నివేదా థామస్ కెరియర్‌ను చక్కగా సెట్ చేసుకుంటోంది. ప్రస్తుతానికి నటనా ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తున్న నివేద.. ఇప్పటికే తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, అదితి రావు హైదరితో కలిసి ‘వి’ సినిమా స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె.. మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.

ఈ సందర్భంగా మాట్లాడిన నివేద.. సినిమాలో చేసిన ప్రతీ ఒక్కరు కూడా తమ పాత్రలకు 100 శాతం న్యాయం చేశారని తెలిపింది. అందరూ తమ క్యారెక్టర్స్‌లో జీవించారు కాబట్టే సినిమా ఇంత బాగా వచ్చిందన్న భామ.. నాని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పలేనని సినిమాలో చూస్తేనే బాగుంటుందని చెప్పింది. తను పర్సనల్‌గా మంచి ఫ్రెండ్ అని.. సినిమాల గురించి ఇద్దరం డిస్కస్ చేస్తామని తెలిపింది. ఇక అదితి చాలా స్వీట్ అండ్ టాలెంటెడ్ అన్న నివేద.. ఈ మూవీ లాక్‌డౌన్‌కు ముందే పూర్తయినా థియేటర్‌లో రిలీజ్ చేసే అవకాశం లేదని వెల్లడించింది. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు సహకరిస్తానని చెప్పింది. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోతున్న సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అభిప్రాయ పడింది. కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ‘వి’ చిత్రానికి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించారు.

ఇక కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులు ఇలాగే ఉండవని.. అంతా నార్మల్ అయిపోతుందని చెప్పింది.



Next Story