రానా సినిమాపై అంచనాలు పెంచిన నివేథా పేతురాజ్

by Shyam |
nivetha pethuraj
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా నటిస్తున్న ‘విరాట పర్వం’ సినిమాపై అందాల భామ నివేథా పేతురాజ్ అంచనాలు పెంచేసింది. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో ముచ్చటించిన నివేథా.. రానా సినిమాలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో లీడ్‌ రోల్ సాయిపల్లవి నటిస్తుండగా, నివేథా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

అయితే ఈ సినిమాలో నివేథా కనిపించేది తక్కువ సమయమైనా, ఎంతో బాగా వచ్చిందని, ఈ రోల్ తన సినీ కెరీర్‌లో మరిచిపోలేని మైలురాయి అవుతుందని వ్యాఖ్యానించింది. ఆమె మాటలతో రానా సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ‘విరాట పర్వం’ సినిమా విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో నవీన్ చంద్ర, జరీనా వహాబ్, బెనర్జీ, ఈశ్వరీరావు, ప్రియమణి, నందితాదాస్‌లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Next Story