త్వరలో.. నిత్య ఇంగ్లీష్ ఫస్ట్ సింగిల్

దిశ, వెబ్‌డెస్క్: ముద్దుగుమ్మ నిత్యా మీనన్ ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుంది. అంతేకాదు తను ఏ ప్రయోగానికి సిద్ధపడినా, సక్సెస్ అయ్యే వరకు వదిలిపెట్టదు. ఇప్పటికే యాక్టర్‌గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తను.. సింగర్ గాను ప్రూవ్ చేసుకుంది. ఈ మధ్యే ‘బ్రీత్ ఇన్ టు ది షాడోస్’ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్న నిత్య.. ఫస్ట్ ఇంగ్లీష్ సింగిల్‌తో ఆకట్టుకోబోతుంది.

బెంగళూరులోని రాహుల్ దీక్షిత్ స్టూడియోలో ఇందుకు సంబంధించిన పని పూర్తయిందని తెలిపిన నిత్య.. వీడియో షూట్ కొంచెం బ్యాలెన్స్ ఉందని చెప్పింది. యూకేకు చెందిన సరోడ్ ప్లేయర్ సౌమిక్ దత్తతో కలిసి ఫస్ట్ సింగిల్‌తో వచ్చేస్తున్నట్లు వెల్లడించింది. అనుకోకుండా ఈ అవకాశం దక్కిందని.. కరోనా ప్రబలక మునుపే ఈ డీల్ కుదిరిందని, కానీ సాంగ్ రికార్డింగ్ మాత్రం ఇప్పుడు జరిగిందని చెప్పింది. సాంగ్‌లో సౌమిక్ పోర్షన్స్‌కు సంబంధించిన షూటింగ్ లండన్‌లో జరుగుతుండగా.. తన పోర్షన్‌పై టీమ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. చాలా చాలా ప్రత్యేకమైన ఈ సాంగ్‌ను ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్‌తో కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎగ్జైటింగ్‌గా ఉందని, త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని వెల్లడించింది.

Advertisement