పెగాసెస్ వివాదం.. బీజేపీకి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం

by Shamantha N |
పెగాసెస్ వివాదం.. బీజేపీకి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం
X

పాట్నా: పెగాసెస్ వివాదం పై ప్రతి పక్షాలకు అనుకూలంగా మొదటి సారిగా ఎన్డీఏ పక్షాలు నోరు విప్పాయి. పార్లమెంట్ లో జరుగుతున్న ఆందోళనలపై బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. పెగాసెస్ వివాదం పై విచారణ చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘విషయం అంతా ప్రజల్లోకి వెళ్లింది, ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే విషయాలు మంచివి కావని’ ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. టెలిఫోన్ ట్యాపింగ్ పై చాలా రోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయని, ఈ విషయం ఇప్పుడు పార్లమెంట్ లో కూడా లేవనెత్తారని అన్నారు.

అయితే ఈ వివాదం పై కేంద్రప్రభుత్వం పార్లమెంట్ లో వివరణ ఇచ్చింది. చట్టపరంగా ఏయే అంశాలపై దృష్టి పెట్టాలో మాకు తెలుసని, దీనిపై చర్చించటం కుదరదని ప్రకటించింది. పెగాసెస్ పై బీజేపీ అనుకూల సోషల్ మీడియా కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

పెగాసెస్ వివాదాన్ని లేవనెత్తిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ది ఫర్ బిడెన్ స్టోరీస్ పేరిట వార్తలు రాసే సంస్థలకు అమెరికా సంపన్నుడైన జార్జ్ సారోస్, అతని సంస్థ అయిన ఒపెన్ సోసైటీ పౌండేషన్ నుంచి నిధులు అందిస్తున్నారని విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. 2018 లో దావోస్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దింపటమే తన లక్ష్యంగా అమెరికా సంపన్నుడైన జార్జ్ సారోస్ బహిరంగంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయాన్నే బీజేపీ హైలైట్ చేస్తూ, విమర్శలను తిప్పి కొడుతోంది.

Advertisement

Next Story