భారత్‌లో టెస్లా ప్లాంట్‌ను ప్రారంభిస్తే మరింత మద్దతు : నితిన్ గడ్కరీ

by Harish |
భారత్‌లో టెస్లా ప్లాంట్‌ను ప్రారంభిస్తే మరింత మద్దతు : నితిన్ గడ్కరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రిక్ వాహానాలను ప్రోత్సహించడానికి కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలొ భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీని వీలైనంత త్వరగా ప్రారంభించాలని దిగ్గజ ఈవీ కార్ల తయారీ కంపెనీ టెస్లాను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. భారత్‌లో కార్ల తయారీని ప్రారంభించడం టెస్లాకు బంగారం లాంటి అవకాశమని ఆయన చెప్పారు. ఇప్పటికే దేశీయ ఆటోమొబైల్ తయారీ కంపెనెల నుంచి విడిభాగాలను కొనుగోలు చేస్తోందని, స్థానికంగానే ప్లాంట్‌ను కలిగి ఉండటం ద్వారా కంపెనీకి ఆర్థికంగా మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని ఓ సదస్సులో పాల్గొన్న ఆయన చెప్పారు.

టెస్లా కంపెనీ సొంతంగానే ప్లాంట్‌ను నిర్మించి, ఆసియా దేశాలను ఎగుమతులను నిర్వహించడానికి వీలుంటుందని గడ్కరీ తెలిపారు. భారత్‌లో కార్ల తయరీని మొదలుపెడితే మద్దతిస్తామని గడ్కరీ పేర్కొన్నారు. కాగా, టెస్లా ఇండియా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో తన ఆర్అండ్‌డీ కేంద్రాన్ని భారత్‌లో ప్రారంభించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం కంపెనీ వ్యాపార నిర్వహణకు ఎగ్జిక్యూటివ్‌ను కూడా ఇటీవల నియమించింది. తాజాగా, కంపెనీ ఖరీదైన, విశాలమైన షోరూమ్‌ల కోసం ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో ప్రయత్నాలు చేస్తున్నట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed