- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'సంస్కరణ అంటే కార్మిక చట్టాల రద్దు కాదు!'
దిశ, సెంట్రల్ డెస్క్: కార్మిక చట్టాల్లో సంస్కరణలు అంటే వాటిని రద్దు చేయడం కాదు, కేంద్రం కార్మిక చట్టాలను రక్షించేందుకు కట్టుబడి ఉంటుందని నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపార సంస్థలకు కొన్ని వెసులుబాట్లు కల్పించేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో మార్పులు చేయాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే ఆదివారం జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కుమార్ కార్మిక చట్టాల గురించి స్పందించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో మార్పులు చేయడం తమ దృష్టికి వచ్చినట్టు ప్రస్తావించారు. అంతర్జాతీయ కార్మిక సమాఖ్య(ఐఎల్‌వో)లో ఇండియా సభ్య దేశంగా ఉంది. సంస్కరణలు పేరుతో చట్టాలను రద్దు చేయడం వీలవదు. దీనికి సంబంధించి కార్మిక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ కార్మికుల సంక్షేమాన్ని గౌరవిస్తుందని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. కొన్ని వారాల క్రితం కరోనా వల్ల దెబ్బ తిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు మూడేళ్ల వరకు కార్మిక చట్టాల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.