జనాభా నియంత్రణ సామాజిక బాధ్యత

by Aamani |
జనాభా నియంత్రణ సామాజిక బాధ్యత
X

దిశ, ఆదిలాబాద్: జనాభా నియంత్రణ సామాజిక బాధ్యత అని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అన్నారు. శనివారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో రోజురోజుకూ జనాభా పెరిగిపోవడం వలన భవిష్యత్‌లో తలెత్తే సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించి, వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు.ఇది ఇలానే కొనసాగితే వనరులు తగ్గిపోయి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు స్త్రీలకు మాత్రమే జరుగుతున్నాయని, పురుషులు కూడా వ్యాసెక్టమీ ఆపరేషన్లు చేయించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. సంతానానికి మధ్య కనీసం రెండేండ్ల వ్యవధి ఉండేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో విశిష్ఠ సేవలు అందించిన ఆశావర్కర్లకు, ఏఎన్ఎంలకు, వైద్యులకు కలెక్టర్ ప్రశంస పత్రాలు, నగదును అందజేశారు.కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డా. వసంతరావు, డాక్టర్లు రజిని, కార్తీక్, ఆశిష్ రెడ్డి, అరుణ్, మాస్ మీడియా అధికారి బారె రవీందర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed