ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలి

దిశ నిర్మల్: ఈ -సేవా కేంద్రాలలో ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఈ సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేశారు. సేవా కేంద్రంలో ప్రజలకు అందుతున్న ఆధార్, ఇతర సేవలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తహశీల్దార్ సుభాష్ చందర్, ఈ సేవా కేంద్రం మేనేజర్ ప్రవీణ్, ఆపరేటర్లు చంద్రకాంత్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ మాట్లాడుతూ.. ఈ-సేవా ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా సేవలందించాలని తెలిపారు. సేవా కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్‎కు సూచించారు.

Advertisement