ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ చర్యలు..!

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‎లో వానాకాలం 2020-21 పంట కాలానికి సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రాంరెడ్డి, జిల్లా ఇంచార్జి రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్, జిల్లా అటవీ శాఖ అధికారి, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వానాకాలం ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధికారుల అంచనా ప్రకారం ఈ పంట కాలంలో ఒక లక్ష 56వేల 232 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రావడం జరుగుతుందని తెలిపారు. ధాన్యం సేకరణ సంబంధించిన రవాణా, సంచులు, మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సూచించారు.

Advertisement