రేపు నిర్భయ దోషులకు ఉరి!

by Shamantha N |
రేపు నిర్భయ దోషులకు ఉరి!
X

న్యూఢిల్లీ: నిర్భయ కేసులోని నలుగురు దోషులకు షెడ్యూల్ ప్రకారమే రేపు(శుక్రవారం) ఉదయం 5.30 గంటలకు ఉరి శిక్ష అమలవుతుందని ఢిల్లీ కోర్టు తెలిపింది. నలుగురు దోషులు అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌లన్నింటిని పటియాలా హౌజ్ కోర్టు తోసిపుచ్చింది. తమకు న్యాయపరమైన అవకాశాలు ఇంకా ఉన్నాయని, కాబట్టి ఉరిశిక్ష నిలుపుదల చేయాలని దోషులు.. కోర్టును అభ్యర్థించారు. కాగా, వారికి న్యాయపరమైన అవకాశాలేమీ మిగిలి లేవని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్ కోర్టుకు తెలిపారు. దోషులు పవన్, అక్షయ్‌లు రెండో సారి విజ్ఞప్తి చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పరిగణించలేదని వివరించారు. ఢిల్లీ కోర్టు రూలింగ్‌తో రేపు ఉదయం తీహార్ జైలులో నలుగురు నిర్భయ దోషులకు ఉరిఖాయంగానే కనిపిస్తున్నది.

Tags : nirbhaya, convict, to be hang, tihar jail, delhi court



Next Story

Most Viewed