- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీరవ్ మోదీ సోదరుడిపై మరో కేసు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ బ్యాంకులను వేల కోట్లలో భారీ మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీపై అమెరికాలోని న్యూయార్క్‌లో కేసు నమోదైంది. నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ తప్పుడు ధృవపత్రాలాతో మాన్‌హట్టన్‌లోని వజ్రాల్ హోల్‌సేల్ ఎల్ఎల్‌డీ డైమండ్స్ యూఎస్ఏ నుంచి 26 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాలను పొందాడు. వీటిని తన వ్యక్తిగత అవసరాలకు విక్రయించినట్టు తేలిందని మాన్‌హాట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ సీవై వేన్స్ జూనియర్ ప్రకటించారు.
గతంలో నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులోనూ నేహాల్‌పై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నేహాల్ 27వ నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులో జరిగిన మోసాన్ని ఏమార్చేందుకు ఆధారాలను నాశనం చేశారనే అభియోగం ఉంది. తాజాగా, ఎల్ఎల్‌డీ నుంచి వజ్రాలను ఇతర సంస్థలకు విక్రయిస్తానని నమ్మించి మోసం చేశారని తేలింది. న్యూయార్క్ చట్టం ప్రకారం క్రిమినల్ కేసు నమోదైంది. దీనిప్రకారం..25 ఏళ్ల పాటు కారాగారా శిక్ష విధించివచ్చని తెలుస్తోంది.