పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలి: మంత్రి సింగిరెడ్డి

by Shyam |   ( Updated:2020-05-06 05:01:10.0  )
పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలి: మంత్రి సింగిరెడ్డి
X

దిశ, మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న బ్రాంచ్ కెనాల్ పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం ఘనపురం బ్రాంచ్ కెనాల్‌ను ఆయన సందర్శించారు. మామిడిమాడ, పర్వతాపూర్, అల్లమాయపల్లి, అప్పారెడ్డిపల్లి, షాపూర్, ఘనపురం, మానాజీపేట కాలువ పనులను కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే అధికారులతో మాట్లాడుతూ వానాకాలంలో కాలువ పరిధిలో ఉన్న ప్రతి చెరువు నిండాలని చెప్పారు. పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కొత్తవాళ్లను నియమించి పెండింగ్ పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయించాలని సూచించారు. పనుల్లో జాప్యం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Tags: Singireddy Niranjan Reddy, Orders, Officials, Branch canal works, complete immediately, wanaparthy



Next Story