- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
400 పేజీలతో… సురవరం పేరుమీద సంచిక
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: సురవరం ప్రతాప రెడ్డి పాలమూరు జిల్లా ప్రతిష్ట అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తిలో సురవరం ప్రతాపరెడ్డి 67వ వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… 13 నెలలే ఎమ్మెల్యేగా ఉన్నా సాహితీ, సాంస్కృతిక, సాంఘీక ఉద్యమాల ద్వారా ఆయన చేసిన కృషి అసామాన్యం అన్నారు. అందుకే ఆయన కాంస్య విగ్రహాన్ని వనపర్తిలో సెప్టెంబరు 9న, కాళోజీ నారాయణరావు జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు.
తెలంగాణ భాషకు, తెలుగు భాషకు గొప్ప కీర్తిని గడించిన సురవరం విగ్రహం సాహితీ మితృలు, తెలంగాణ వాదుల సూచన మేరకు ఆవిష్కరించుకోవడం గొప్పగా భావిస్తున్నామని చెప్పారు. వనపర్తిలో సురవరం ప్రతాపరెడ్డి పేరు మీద పార్కు నిర్మించాలని మున్సిపాలిటీ నిర్ణయించిందని, దీంతో మున్సిపాలిటీ పాలకమండలికి ధన్యవాదాలు తెలిపారు. సురవరం ఆశయసాధన కొనసాగింపు తెలంగాణ ఉద్యమంలో జెండాను ఎత్తిన సాధారణ కార్యకర్తగా నా బాధ్యతగా భావించి, వారి కీర్తి పతాక చిరస్థాయిగా ఎగరాలని విగ్రహం ఏర్పాటు చేస్టున్నట్టు తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డి పేరుమీద ఒక సంచిక 400 పేజీలతో రెండు సంపుటాలుగా తీసుకురావడం జరుగుతుందన్నారు. ఇది సురవరం మీద అధ్యయనం చేసేందుకు ఈ సంకలనం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
- Tags
- Bronze statue
- mahabubnagar
- minister niranjan reddy
- Minister Niranjan Reddy laid the foundation stone
- statue of Suravaram Pratapareddy
- à°®à°à°¤à±à°°à°¿ సిà°à°à°¿à°°à±à°¡à±à°¡à°¿ నిరà°à°à°¨à± à°°à±à°¡à±à°¡à°¿
- మహబà±à°¬à±âà°¨à°à°°à±
- à°¸à±à°°à°µà°°à° à°ªà±à°°à°¤à°¾à°ª à°°à±à°¡à±à°¡à°¿