- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాలంటీర్లకు నిమ్మగడ్డ వార్నింగ్
దిశ వెబ్‌డెస్క్: ఏపీలో వాలంటీర్ల వ్యవహారం ఎప్పుడూ వివాదాస్పదం అవుతూ ఉంటుంది. ఎన్నికల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుందనే ఆరోపణలు ప్రతిపక్షాలు నుంచి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై తాజాగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ఎన్నికల్లో వాలంటీర్లు జోక్యం చేసుకోవద్దని, జోక్యం చేసుకున్నట్లు తమ దృష్టికి వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాని నిమ్మగడ్డ హెచ్చరించారు.
ఎన్నికల్లో వాలంటీర్ల జోక్యం చట్టవిరుద్దమని, ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దన్నారు. ఎన్నికలు జరుగతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులతో వాలంటీర్లు మాట్లాడవద్దని నిమ్మగడ్డ సూచించారు.
కాగా, వాలంటీర్ల తమ వద్ద ఉన్న ఫోన్లను వెంటనే అధికారులకు తిరిగి ఇచ్చేయాలని నిన్న ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.