ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అవాస్తవం

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్నికల షెడ్యూల్ పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయలేదని వ్యాఖ్యానించారు.

Advertisement