ఎస్ఈసీగా నిమ్మగడ్డ బాధ్యతల స్వీకరణ!

దిశ, వెబ్ డెస్క్ :
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి నియామకం కానున్నారు. సోమవారం దానికి సంబంధించి బాధ్యతలను ఆయన స్వీకరించనున్నారు.

గతంలో కరోనా పేరుతో కావాలనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారనే కారణంగా ఏపీ ప్రభుత్వం ఆయన్ను పదవీ నుంచి తొలగించగా.. నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఫేవర్‌గా తీర్పు వచ్చినా జగన్ ప్రభుత్వం తిరిగి ఆయన్ను ఎస్‌ఈసీగా నియమించలేదు.

అంతేకాకుండా హైకోర్టు తీర్పును సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. దీంతో నిమ్మగడ్డ మరల హైకోర్టును ఆశ్రయించగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించాల్సిందేనని.. కొత్తగా చేపట్టిన నియామకం చెల్లదని తీర్పునిచ్చింది.. దానికి తోడు గవర్నర్ విచక్షణాధికారంతో నియామకం చేపట్టోచ్చని సూచించింది. చివరగా, గవర్నర్ కూడా ఒకే అనడంతో నిమ్మగడ్డ ఏపీ ఎన్నికల కమిషనర్‌గా రేపు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు.

Advertisement