విచక్షణతో నిర్ణయం తీసుకున్నాను..మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ!

by  |
విచక్షణతో నిర్ణయం తీసుకున్నాను..మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ!
X

దిశ, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్ఈసీ) పదవీకాలం కుదింపు వ్యాజ్యంపై రిప్లై పిటిషన్ వేసిన కమిషనర్ పనుల్లో సాయం చేయడానికి సెక్రటరీ విధులు పరిమితంగా ఉంటాయని మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పేర్కొన్నారు. ఎస్ఈసీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఈసీ కార్యదర్శికి చెప్పాల్సిన అవసరమేమీ లేదని ఆయన హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్నికల వాయిదా అనేది గోప్యంగా తీసుకోవాల్సిన నిర్ణయమని, ఈసీ న్యాయ విభాగం వాయిదా నోటిఫికేషన్ తయారు చేసిన తర్వాతే సంతకం చేశానని వివరించారు. విచక్షణతో వాయిదా వేసే అధికారం ఎన్నికల కమిషనర్‌కు ఉంటుందని స్పష్టం చేశారు. ఈసీ ఉద్యోగులతో ఎస్ఈసీ నిర్ణయాలన్నీ చర్చించాల్సిన అవసరంలేదని రమేశ్ కుమార్ వివరించారు. పదవీ కాలం కుదింపు వ్యాజ్యంపై రాష్ట్రం ప్రభుత్వం చేఇసిన దాఖలు తుది అఫిడవిట్ గురించి హైకోర్టులో మంగళవారం వాదనలు జరగనున్నాయి.

Tags : SEC, nimmagadda ramesh, high court


Next Story

Most Viewed