- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీలోఫర్ డాక్టర్లు, నర్సులు క్వారంటైన్‌లోకి
దిశ, న్యూస్ బ్యూరో: నీలోఫర్ ఆస్పత్రిలో మూడు రోజులుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పోస్టు గ్రాడ్యుయేట్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు, ఇతర వైద్య సిబ్బంది, క్లాస్ ఫోర్ ఉద్యోగులు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. వార్డులను శుభ్రం చేసే ఆయాలు, సెక్యూరిటీ సిబ్బందిని కూడా క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక చిన్నారికి పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో గత మూడు రోజులుగా చికిత్స చేసిన వీరంతా క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాల్సిందిగా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ చిన్నారికి చికిత్స చేసిన వార్డులో ఈ నెల 15వ తేదీ రాత్రి షిప్టులో పనిచేసినవారు, ఆ తర్వాత 16, 17 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి షిప్టుల్లో పనిచేసిన మొత్తం సిబ్బంది తక్షణం క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని సూపరింటెండెంట్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మూడు రోజుల్లో అన్ని షిప్టుల్లో కలిపి సుమారు పది మంది డాక్టర్లు, మరికొంతమంది నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, క్లాస్ ఫోర్ ఉద్యోగులు విధుల్లో ఉన్నారనీ, ఆ చిన్నారికి పాజిటివ్ అని నిర్ధారణ అయినందువల్ల ముందుజాగ్రత్త చర్యగా సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్‌లోకి పంపించామని తెలిపారు. వీరంతా క్వారంటైన్‌లో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యతలను నీలోఫర్ హాస్పిటల్‌లోని అన్ని డిపార్ట్‌మెంట్‌ల హెడ్‌లకు అప్పగించామని వెల్లడించారు. అయితే, క్వారంటైన్‌లోకి సుమారు 40మంది సిబ్బంది వెళ్లుండొచ్చని అంచనా. కానీ, ఆస్పత్రివర్గాలు మాత్రం పది మంది మాత్రమేనని చెబుతున్నాయి.
Tags: Telangana, Niloufer Hospital, Hyderabad, Doctors, Corona, Child, Quarantine, Superintendent