'చెప్పు తెగుద్ది ఎదవా'.. జో బైడెన్‌కి హీరో నిఖిల్ స్ట్రాంగ్ వార్నింగ్

by Anukaran |   ( Updated:2021-08-26 02:22:18.0  )
చెప్పు తెగుద్ది ఎదవా.. జో బైడెన్‌కి హీరో నిఖిల్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, సినిమా: సమాజంలో జరుగుతున్న సంఘటనలకు చలించి తనదైన శైలిలో స్పందించే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. ఈ సారి ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి, వార్తల్లో హాట్ టాపిక్‌గా మారాడు. అందుకు కార‌ణం.. ఆఫ్ఘనిస్థాన్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలే. కొద్దిరోజులుగా ఆఫ్ఘనిస్తాన్ లో దుర్భర్బ పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్ఘాన్ నుంచి అమెరికా సేన‌లు తిరిగి వెళ్లిపోగానే తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో ప్రజ‌లు భ‌యంతో ఇత‌ర దేశాల‌కు ప‌రుగులు తీస్తున్నారు.

కొంద‌రు అమాయ‌కులైతే ప‌లు ఘ‌ట‌న‌ల్లో ప్రాణాల‌ను కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న 5,800 మంది అమెరికా సైనికులు ఎంత త్వరగా అమెరికా వస్తే అంత మంచిదని చెప్పుకొచ్చాడు. అమెరికా బలగాలను ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు 31లోగా ఉప సంహరిస్తామని, డెడ్ లైన్ లోగా మిషన్ పూర్తి చేస్తామని బైడెన్ స్పష్టం చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్నే రేపాయి. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌లో ఇలాంటి ప‌రిస్థితికి కార‌ణ‌మైన బైడెన్ పై నిఖిల్ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు.

‘‘20 ఏళ్లు ఆ దేశాన్ని అనేక ఇబ్బందులకు గురిచేశారు. చివరకు వదిలేసి వెళ్లిపోయారు. మిస్టర్ బైడెన్ మరోసారి ఫ్రీడమ్ గురించి మాట్లాడితే చెప్పు తెగుద్ది ఎదవ’’ అని ట్వీట్ చేశారు నిఖిల్. దీనిపై నెటిజ‌న్స్ భిన్నాభిప్రాయాల‌ను వ్యక్తం చేస్తున్నారు. నిజమే చెప్పారు నిఖిల్ అని కొంతమంది అంటుంటే.. సెలబ్రెటీలు ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడకూడదు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కరోనా సమయంలో ఎంతోమందికి సాయం చేసిన నిఖిల్ పెట్రోల్ రేట్లు పెరగ‌డంపై కూడా కాస్త గ‌ట్టిగానే ట్విట్టర్ ద్వారా స్పందించిన సంగ‌తి తెలిసిందే. ఇక నిఖిల్ సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం ఆయన ’18 పేజీస్’, ‘కార్తికేయ 2’ చిత్రాలలో నటిస్తున్నాడు.

Advertisement

Next Story