గీత దాటిన మీడియా.. హీరో నిఖిల్ ఆగ్రహం.. అక్కడ కెమెరాలు ఏంటంటూ..?

by Anukaran |   ( Updated:2021-09-14 00:18:28.0  )
గీత దాటిన మీడియా.. హీరో నిఖిల్ ఆగ్రహం.. అక్కడ కెమెరాలు ఏంటంటూ..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో నిఖిల్ ఎప్పుడు సామజిక సమస్యలపై స్పందిస్తూ ఉంటాడు. తనకు నచ్చని విషయాన్నీ నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. ట్విట్టర్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నిఖిల్ తాజాగా సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ విషయంలో మీడియా వేస్తోన్న వార్తలపై మండిపడ్డారు. సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలనుకోవడం తప్పు లేదు.. కానీ, ఐసీయూ లో ఉన్నప్పుడు కూడా ప్రైవసీ ఇవ్వరా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెప్టెంబర్ 10న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుతప్పి సాయి ధరమ్ తేజ్ కిందపడిపోవడంతో వెంటనే దగ్గరలోని మెడికోర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి అపోలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తేజ్ కు ఐసీయూలో చికిత్స చేస్తున్న సమయంలో.. ‘ఇక్కడ చూడండి. కళ్లు తెరవండి’ అంటూ వైద్యుడు సాయి ధరమ్ తేజ్ చేతిపై తడుతున్న వీడియో ఇటీవల బయటకు రావటం తెలిసిందే. దీనిపై నిఖిల్ ట్వీట్ చేస్తూ “చికిత్స చేస్తున్న వీడియోలు బయటకు రావటం బాధాకరం.. ఐసీయూలో ఉన్నప్పుడైనా ఆ వ్యక్తికి గౌరవం ఇవ్వండి.. అక్కడ కూడా వారికి ప్రైవసీ లేదా..? ఐసీయూలోకి కెమెరాలను ఎలా అనుమతించారు? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. నిఖిల్ చెప్పిన దాంట్లోనూ వాస్తవం లేకపోలేదని, ప్రముఖుల వార్త కాబట్టి మీడియా ఇంకా ఎక్కువ చేస్తోందని నెటిజన్లు సైతం నిఖిల్ కి మద్దతు తెలుపుతున్నారు. కొన్నిసార్లు మీడియా గీత దాటుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story