‘రైడర్‌’గా వస్తోన్న దేవెగౌడ మనవడు

by Anukaran |   ( Updated:2020-09-11 12:22:30.0  )
‘రైడర్‌’గా వస్తోన్న దేవెగౌడ మనవడు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్ర‌ధాని హెచ్‌.డి. దేవెగౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడు నిఖిల్ కుమార్ గౌడ హీరోగా న‌టిస్తున్న నాలుగో చిత్రానికి ‘రైడ‌ర్’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శుక్ర‌వారం సాయంత్రం ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో నిఖిల్ కుమార్ ప‌రుగెత్తుతూ క‌నిపిస్తున్నారు. ‘రైడ‌ర్’ అనే టైటిల్‌కు పూర్తి న్యాయం చేస్తున్న‌ట్లుగా ఆ ఫ‌స్ట్ లుక్‌లో ఆయ‌న క‌నిపిస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ల‌హ‌రి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై చంద్రు మ‌నోహ‌ర‌న్ నిర్మిస్తున్నారు. ‘రైడ‌ర్‌’లో నిఖిల్ కుమార్ స‌ర‌స‌న కథానాయిక‌గా క‌శ్మీరా ప‌ర‌దేశి న‌టిస్తున్నారు. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఏక కాలంలో ఈ మూవీ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ తగు ఏర్పాట్లు చేస్తోంది. అర్జున్ జ‌న్యా సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి శ్రీష ఎం. కుడువ‌ల్లి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

Advertisement

Next Story