- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిహారిక గ్యాప్ ఇవ్వడం లేదుగా!
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల మళ్లీ షూటింగ్స్‌తో బిజీ కానుంది. మాల్దీవ్స్‌లో హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చిన నిహారిక.. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా కెరీర్‌పై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే ‘రాయుడు చిత్రాలు’ బ్యానర్‌పై రూపొందుతున్న తన వెబ్ సిరీస్ లాంచింగ్ కార్యక్రమానికి హాజరైంది. భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన నిహా.. ఈ సిరీస్‌లో అనసూయ భరద్వాజ్, యూ ట్యూబర్ నిఖిల్‌తో కలిసి పనిచేయనుంది. కాగా ఈ కార్యక్రమానికి రచయిత విజయేంద్ర ప్రసాద్, డైరెక్టర్ వీవీ వినాయక్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శక నిర్మాత భాను రాయుడు.. ఫాంటసీ డ్రామా జోనర్‌లో సిరీస్ తెరకెక్కనుందని తెలిపారు. నిహారిక తమ కథకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో సంప్రదించగా.. స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పారని వెల్లడించారు. త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్న సిరీస్‌కు కళ్యాణ్ మాలిక్ సంగీతం సమకూర్చనున్నారు.