- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నిహారిక నిశ్చితార్థం..?

మెగా డాటర్ నిహారిక త్వరలో పెళ్లి పీటలెక్కనుందన్న విషయం తెలిసిందే. కాబోయే భర్త జొన్నలగడ్డ చైతన్యను సోషల్ మీడియా వేదికగా.. సస్పెన్స్‌ల నడుమ రివీల్ చేసిన భామ.. తనతో మూడు ముళ్లు వేయించుకునేందుకు వెయిట్ చేస్తోంది. మిస్ పోస్ట్ నుంచి మిసెస్ అయిపోతున్న నిహారిక.. అతి త్వరలో ఏడడుగులు వేసే చాన్స్ ఉందట.
కాగా ఈ విషయంపై స్పందించిన నాగబాబు.. నిశ్చితార్థం, పెళ్లి వేడుకలు అతికొద్ది మంది బంధుమిత్రుల నడుమ నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ లాక్‌డౌన్ నిబంధనల ప్రకారమే ఈ తంతు జరుగుతుందని స్పష్టం చేశారు. కూతురి పెళ్లి ఘనంగా చేయాలని అనుకున్నా సరే.. పరిస్థితులు సపోర్ట్ చేయడం లేదన్నారు. అంటే ఈ మధ్య కాలంలోనే ‘నిహా’ కళ్యాణ మహోత్సవం జరగనుందని మాత్రం అర్థం అవుతోంది. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి అందిన సమాచారం ప్రకారం ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్ అయిందని.. నిహారిక నిశ్చితార్థం ఆగస్ట్ 13న జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.