ఘనంగా నిహారిక-చైతన్య ల ఎంగేజ్మెంట్ 

by  |
ఘనంగా నిహారిక-చైతన్య ల ఎంగేజ్మెంట్ 
X

దిశ, వెబ్ డెస్క్: లాక్ డౌన్ సామాన్యులకి ఎలా ఉన్నా టాలీవుడ్ బడా ఫ్యామిలీస్ కి మాత్రం కలిసొచ్చింది. వాళ్ళకి కలిసి రావడం అంటే మిడిల్ క్లాస్ వాళ్లకి డబ్బులు కలిసొచ్చినట్టు కాదు… టైం కలిసి రావడం. అంతేగా మరి… ఎప్పుడూ షూటింగులూ, ఔటింగులూ అంటూ తిరిగేవాళ్ళకి ఇంత ఫ్రీ టైం దొరకదు కదా! ఈ సమయాన్ని కుటుంబంతో గడపడానికి బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇక ఇదే అదునుగా శుభకార్యాలకు కూడా పెద్ద పీట వేసేస్తున్నారు. చాలామంది సెలెబ్స్ పెళ్లిళ్లు కూడా చేసేసుకుంటున్నారు.

ఇదే తరుణంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన కార్యక్రమానికి చాలా కొద్ది మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. కొవిడ్ -19 ప్రోటోకాల్ నిబంధనలను అనుసరిస్తూ జరిగిన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో పాటు కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.

వైలెట్ కలర్ లెహంగాలో నిహారిక మెరిసిపోగా.. అందుకు తగినట్లుగా కాబోయే భర్త చైతన్య కూడా మ్యాచింగ్ కలర్ సూట్ లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపించారు. గత నెలలో సోషల్ మీడియా వేదికగా నిహారిక తనకు కాబోయే భర్తను పరిచయం చేయగా.. ఈ ఎంగేజ్ మెంట్ తో ఇద్దరి మధ్య బంధం లీగల్ అయిపోవడంతో హ్యాపీగా ఉన్నారు. కాగా పెళ్లి డిసెంబర్ లో ఉంటుందని సమాచారం.


Next Story

Most Viewed