- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియా.. ఆటోగ్రాఫ్ ప్లీజ్ : నిక్
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ క్యూట్ కపుల్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎవరికి వారు తమ తమ ఫీల్డ్స్‌లో రాణిస్తుండగా.. ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే విషయంలో ఇద్దరూ కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు. కాగా ప్రియాంక రాసిన ‘అన్ ఫినిష్డ్’ పుస్తకం ఈ మధ్యే పూర్తయ్యింది. దీన్ని పెంగ్విన్ రాండమ్ హౌజ్ పబ్లిష్ చేస్తుండగా.. ఈ పుస్తకం కవర్ పేజీని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నిక్. ప్రియాంక నిన్ను చూస్తే గర్వంగా ఉందన్న నిక్.. నాదొక ప్రశ్న.. మీరు ఆటోగ్రాఫ్ చేసిన కాపీని ఇస్తారా? అని అడిగాడు. అందరూ కూడా తన భార్య రాసిన అందమైన పుస్తకం గురించి ముందే ఆర్డర్ చేయాలని కోరాడు.
దీనిపై స్పందించిన ప్రియాంక.. అవును ఆటోగ్రాఫ్ చేసిన ‘అన్ ఫినిష్డ్’ పుస్తకాన్ని ఇస్తాను. కానీ మీ ఆటోగ్రాఫ్‌తో కూడిన బ్లడ్ నాకు ఇస్తేనే ఇది సాధ్యం అవుతుందని చెప్పింది. బ్లడ్ అనేది జోనస్ బ్రదర్స్ రాసిన పుస్తకం కాగా.. ఇంకా విడుదల కావాల్సి ఉంది.
సోషల్ మీడియాలో ఈ కన్వర్జేషన్ చూసిన ఫ్యాన్స్ చూడడానికి ఎంత ముచ్చటగా ఉంది అంటున్నారు. నిజంగా ప్రియాంక, నిక్.. మోస్ట్ అండర్‌స్టాండింగ్ కపుల్ అని చెప్తున్నారు. ప్రియాంక మెమోయిర్ అన్ ఫినిష్డ్ ఇప్పటికే యూఎస్‌లో బెస్ట్ సెల్లింగ్ బుక్ లిస్ట్‌లో చేరిపోవడంపై మరింత ఆనందంగా ఉన్నారు అభిమానులు.