నివేదిక ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వానికి NHRC ఆదేశాలు

by srinivas |
నివేదిక ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వానికి NHRC ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. అయితే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దింది. అయితే ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి పలు ఫిర్యాదు అందాయి. 11 మంది రోగులు చనిపోయారంటూ జేస్తడి సుధాకర్ అనే వ్యక్తి, 30 మంది చనిపోయారంటూ మాజీ ఎంపీ చింతా మోహన్ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుల స్వీకరించిన NHRC..రుయా ఘటనపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story