కేంద్ర, రాష్ట్రాలకు ఎన్జీటీ నోటీసులు

by  |
కేంద్ర, రాష్ట్రాలకు ఎన్జీటీ నోటీసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: పర్యావరణ అనుమతులు లేకుండా యంత్రాలతో ఇసుక తవ్వకాలు ఎందుకు జరుగుతున్నాయో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ నోటీసులు జారీ చేసింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు కూడా నోటీసు జారీ చేసిన ఎన్జీటీ చెన్నై బెంచ్ తదుపరి విచారణను ఢిల్లీలోని ప్రిన్సిపల్ బెంచ్‌కు బదిలీ చేసింది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనుల సొసైటీ ముసుగులో గోదావరి నదిలో భారీ స్థాయిలో ఇసుక దోపిడీ జరుగుతోందని, గిరిజనులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుక రీచ్‌లను కేటాయిస్తే కాంట్రాక్టర్లు భారీ స్థాయి యంత్రాలతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని మణుగూరుకు చెందిన భిక్షపతి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.



Next Story