- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రణాళికయుతంగా ‘మూసీ’ పునర్జీవ పనులు
X
దిశ ప్రతినిధి ,హైదరాబాద్: మూసీ నది కాలుష్యాన్ని నివారించి పర్యావరణ హితంగా పునర్జీవింప చేయుటకు ప్రణాళికా యుతంగా పనులను కొనసాగించాలని ఎన్.జీ.టీ మానిటరింగ్ కమిటీ చైర్మన్, జస్టిస్ విలాస్ వి. అఫ్జల్ పుర్కర్ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మొహంతి, రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మూసీ పునరుజ్జీవనానికి వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. ఓ.ఆర్ ఆర్ లోపల 55 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తున్న మూసి నదిలో 42 ప్రధానమైన నాలాలు కలుస్తున్నాయనీ, ప్రధాన ప్రాంతాల్లో మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటుచేస్తున్నట్లు ఈ కమిటీ మెంబర్ కన్వినర్‌గా వ్యవహరిస్తున్న జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ సి. వై .నగేశ్ తెలిపారు.
Advertisement
Next Story