హాంకాంగ్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న నాలుగోదేశం

by vinod kumar |
హాంకాంగ్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న నాలుగోదేశం
X

వెల్లింగ్టన్: చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న హాంకాంగ్‌తో ఎక్స్‌ట్రాడిషన్ ట్రీటిని న్యూజిలాండ్‌ కూడా రద్దు చేసుకున్నది. హాంకాంగ్ టెర్రిటరీకీ నేషనల్ సెక్యూరిటీ చట్టాన్ని చైనా ప్రతిపాదించిన తర్వాత న్యూజిలాండ్ ఈ నిర్ణయంసహా పలుమార్పులు చేపట్టింది. చైనాను కాదని హాంకాంగ్‌కు పటిష్టమై స్వతంత్ర క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఉన్నదని భావించట్లేదని న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ తెలిపారు.

భవిష్యత్తులో చైనా ‘ఒక దేశం, రెండు వ్యవస్థలు’ పద్ధతిని అనుసరిస్తే తమ నిర్ణయాన్ని పునస్సమీక్షించుకుంటామని వివరించారు. నేరస్తులు, నిందితులను ఒకదేశం నుంచి మరో దేశానికి తరలించుకోవడానికి ఎక్స్‌ట్రాడిషన్ ఒప్పందం ఉపకరిస్తుంది. హాంకాంగ్‌పై చైనా మరిన్ని ఆంక్షలు విధించడంతో ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, యూకేలు ఈ ట్రీటిని రద్దు చేసుకున్నాయి. హాంకాంగ్‌తో వాణిజ్యపరమైన ప్రాధాన్యతను అమెరికా తగ్గించుకున్నది. న్యూజిలాండ్‌కు చైనా కీలక వాణిజ్య భాగస్వామి కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed