- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక మలుపు
దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాజకీయాల్లో సంచలనం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును దర్యాప్తు చేపట్టాలని కేంద్ర హోంశాఖ.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ కేసు మరింత ఉత్కంఠంగా మారింది. కాగా, ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. దీంతో ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ శివశంకర్‌ను కేరళ సీఎం పినరయి విజయన్ విధుల నుంచి తొలగించారు.
కాగా, యూఏఈ రాయబార కార్యాలయం పేరు మీదుగా గోల్డ్ స్మగ్లింగ్ అయిందన్న వార్తలు గట్టిగానే వినిపించాయి. దీనిపై స్పందించిన యూఏఈ ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తమ కార్యాలయ పేరు ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని చెప్పుకొచ్చింది. అలాగే, ఈ వ్యవహారంలో దర్యాప్తు ప్రారంభించామని ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారానికి తెరలేపిన ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదని హెచ్చిరికలు కూడా చేసింది. దీంతో మొత్తానికి గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళలోనే కాకుండా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.