కరోనా బాధితుల్లో ముందుగా కనిపించే లక్షణాలు ఇవేనా?

by  |
కరోనా బాధితుల్లో ముందుగా కనిపించే లక్షణాలు ఇవేనా?
X

దిశ, వెబ్‌డెస్క్:
గత డిసెంబర్‌లో వెలుగుచూసిన కరోనా వైరస్.. ఏ మాత్రం తగ్గుముఖం చూపట్లేదు. ప్రతీరోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రష్యా వ్యాక్సిన్ వచ్చినా, అది ఎంత మేరకు ప్రభావం చూపుతుందో తెలియడం లేదు. మరోవైపు భారత్‌ సహా మరెన్నో దేశాలు వ్యాక్సిన్ తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అప్పటి వరకు కరోనా బాధితులకు త్వరితగతిన చికిత్సనందిస్తూ, కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కరోనా లక్షణాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వెల్లడించారు. వైరస్ లక్షణాలు ఒక నిర్దిష్ట క్రమంలో కనిపిస్తాయని వారి అధ్యయనoలో తేలింది. ఈ రీసెర్చ్ విషయాలను తాజాగా ఫ్రాంటియర్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు.

కరోనా వైరస్ ప్రధాన లక్షణాలు.. దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం. మరికొందరిలో వాసన, రుచి కోల్పోవడం, ఒంటిపై దద్దుర్లు రావడం, పింక్ ఐ.. ఇలా వేర్వేరు లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే మెజారిటీ బాధితులపై వైరస్ చూపించే లక్షణాలకు ఒక క్రమ పద్ధతి ఉంటుంది. కరోనా బాధితులకు ముందుగా జ్వరంతో మొదలై తర్వాత దగ్గు పెరుగుతుందని, ఆ వెంటనే కండరాల నొప్పులు వస్తాయని, వికారం వాంతులు వంటి ఇతర లక్షణాలు కూడా ఆ తర్వాత కనిపిస్తాయని పరిశోధనలో తేలింది. కాగా, ఈ లక్షణాల క్రమాన్ని ముందే గుర్తించడం వల్ల రోగులకు వేగంగా చికిత్స చేయొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం కరోనాతొ పాటు, సీజనల్ వ్యాధులు వస్తున్న నేపథ్యంలో ఈ ఆర్డర్ తెలుసుకోవడం చాలా ముఖ్యమని యూఎస్‌సీ ప్రొఫెసర్ పీటర్ కుహ్న్ తెలిపారు. తద్వారా రోగికి చికిత్స అందించడానికి ఏ చర్యలు తీసుకోవాలో వైద్యులు నిర్ణయించగలరు, అంతేకాదు రోగి పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించవచ్చని ఆయన తెలిపారు. ఈ అధ్యయనం కోసం వారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ద్వారా.. చైనాలోని 55,000 కేసులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరో 2,500 కేసులను కూడా పరిశీలించారు.



Next Story

Most Viewed