క్వారంటైన్‌ టైమ్‌లో కొత్త షో… ద రాయ్కర్ కేస్!

by vinod kumar |
క్వారంటైన్‌ టైమ్‌లో కొత్త షో… ద రాయ్కర్ కేస్!
X

దిశ, వెబ్‌డెస్క్: క్వారంటైన్ సమయంలో చూసిన సిరీస్ మళ్లీ చూస్తూ బోర్ కొడుతున్న వాళ్లకి కాస్త కొత్తదనం ఇవ్వడం కోసం వూట్ సెలెక్టులో ద రాయ్కర్ కేస్ అనే సిరీస్ విడుదలైంది. గోవాకు చెందిన పారిశ్రామిక కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. అందుకు కారణం తన కుటుంబమేనని ఆరోపిస్తాడు. మరి అది నిజంగా ఆత్మహత్యేనా లేదా హత్యా అనే విషయాన్ని తేల్చడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు.

ఆదిత్య సప్టోదర్ దర్శకత్వంలో అతుల్ కులకర్ణి, అశ్విన భావే, పారుల్ గులాటి, కునాల్ కరణ్ కపూర్, భూపాలం నటించిన ఈ సిరీస్ ఏప్రిల్ 9న విడుదలైంది. కులకర్ణి కుటుంబ పెద్దగా నటించగా, భూపాలం కేసును విచారించే ఆఫీసర్ పాత్ర పోషించారు. థ్రిల్లర్ కథల మీద ఆసక్తి చూపే వారికి, హంతకుడు ఎవరు అనే తెలియకుండా ఆసక్తి క్రియేట్ చేసే కార్యక్రమాలు ఇష్టపడే వారికి ఈ క్వారంటైన్ టైమ్‌లో ద రాయ్కర్ కేస్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. మరి ఇంకేం వూట్ సెలెక్టులో చూసేయండి.

Tags : Quarantine, Voot Select, The Raiker Case, Whodunit, mystery



Next Story