ఆన్‌లైన్ పాఠాలకు పూర్తి ఫీజు.. ఆగ్రహిస్తున్న తల్లిదండ్రులు

by Shamantha N |
ఆన్‌లైన్ పాఠాలకు పూర్తి ఫీజు.. ఆగ్రహిస్తున్న తల్లిదండ్రులు
X

కరోనా కారణంగా పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. దీంతో ఒకటో తరగతి నుంచి డిగ్రీ పిల్లల వరకు అందరికీ ఆన్‌లైన్ క్లాసులే దిక్కయ్యాయి. నెట్‌వర్క్ సరిగా లేకున్నా, పిల్లాడు వినకపోతున్నా, అల్లరి చేస్తున్నా, చాలా డిస్టర్బెన్స్ అవుతున్నా ఎలాగోలా టీచర్లు ఆన్‌లైన్ పాఠాలు నెట్టుకొచ్చారు. కానీ ఈ క్రమంలో పిల్లలు ఎంత నేర్చుకున్నారు, అసలు నేర్చుకున్నారా ? లేదా అనే విషయం మీద దృష్టి సారించలేకపోయారు. దీంతో అటు టీచర్లకు పాఠాలు చెప్పడంలో కష్టాలు ఏర్పడ్డాయి, ఇటు పిల్లలు నేర్చుకున్నారో లేదోనని తల్లిదండ్రుల్లోనూ అనుమానం మొదలైంది.

మొత్తానికి పరీక్షలు రద్దయ్యాయి. కానీ పిల్లల చదువు మాత్రం గత రెండు నెలలుగా ఆన్‌లైన్‌లో ఇబ్బందుల మధ్యే కొనసాగింది. ఆ పాఠాలు చెప్పిన టీచర్లకు జీతం ఇవ్వాలంటే ఫీజులు వసూలు చేయక తప్పనిసరి. అయితే ఆన్‌లైన్‌లో తమ పిల్లలు ఏమీ నేర్చుకోలేదని, ఎప్పటిలాగా అన్నిటికీ కలిపి ఫీజులు అడగడం సబబు కాదని తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే లాక్‌డౌన్ పరిస్థితుల్లో కూడా టీచర్లు ఇబ్బందులు పడుతూ పాఠాలు చెప్పడంతో వారికి తప్పనిసరిగా జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని పాఠశాల యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే వారి జీతాలకు సరిపోయే మొత్తాన్ని వసూలు చేయాలి గానీ ఎప్పటిలాగా మెయింటెనెన్స్, పుస్తకాలు, ఇతర ఖర్చులన్నీ కలిపి పెద్దమొత్తాల్లో తీసుకోవద్దని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఏదేమైనా ఈ ఆన్‌లైన్ క్లాసుల విషయంలో అటు స్కూల్ యాజమాన్యాలు, ఇటు తల్లిదండ్రుల మధ్య ఇబ్బందులు పడుతూ పాఠాలు చెప్పిన టీచర్లు ఇరుక్కుపోయారు.

Advertisement

Next Story