ప్రపంచ దేశాల చూపు.. తెలంగాణ వైపు

by  |
ప్రపంచ దేశాల చూపు.. తెలంగాణ వైపు
X

దిశ, భువనగిరి: అన్నివర్గాల రైతులకు అండగా నిలిచి, వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని యాదాద్రి-భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎల్మినేటి సందీప్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సమావేశంలో సందీప్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వతంత్ర్య రాష్ర్టం సాధించుకున్న తర్వాత రైతు సంక్షేమం కోసం రైతు పెట్టుబడి సాయం కింద రైతుబంధు పేరిట ఎకరానికి రూ.5వేలు అందించడమే కాకుండా ప్రమాదవశాత్తు రైతు చనిపోతే, రైతుబీమా అందిస్తూ ఆదుకుంటున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 24 గంటల విద్యుత్ అందిస్తూ, ప్రపంచ దేశాల చూపును తెలంగాణ వైపు మళ్లించారని ఆయన అన్నారు. పాలక కమిటీ సభ్యులు సమన్వయంతో నడుచుకోవాలని సూచించారు. రైతు పండించిన పంటకు ప్రభుత్వ మద్దతు ధర ప్రతి రైతుకు అందించేందుకు పాలక కమిటీ తమవంతు సహాయ సహకారాలు ఉండాలని ఆయన కోరారు. ఎమ్యెల్యేలు శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్యలు మాట్లాడుతూ… పాలక కమిటీలో భేదాభిప్రాయాలు లేకుండా అభివృద్ధి చేసుకోవాలని, మావంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.


Next Story