- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆరోగ్య సేతు’ న్యూ ఫీచర్స్
కరోనా కాంటాక్ట్ ట్రేసింగ్‌ను పసిగట్టే లక్ష్యంగా భారత ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్యసేతు యాప్‌లో ఇప్పుడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పటికే 15 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్న ఈ యాప్‌ను రోజుకో రకంగా వినియోగదారులు సులభంగా వాడుకునేలాగా రూపొందిస్తున్నారు. ఇందులో కొత్తగా రీసెంట్ కాంటాక్ట్‌లు అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ బ్లూటూత్ కాంటాక్ట్‌లను తెలుసుకుని, రిస్క్ స్థాయిని విశ్లేషించుకోవచ్చు. ఈ ఫీచర్‌ను పొందడానికి వినియోగదారులు యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.
ప్రయాణంలో యూజర్‌లకు తెలియకుండానే తారసపడే పాజిటివ్ వ్యక్తుల కాంటాక్ట్‌ను ఈ ఫీచర్ ద్వారా అనలైజ్ చేసుకోవచ్చు. అంతేగాకుండా అన్‌లాక్ ప్రక్రియల్లో భాగంగా రోడ్ల మీద ఎక్కువగా సంచరిస్తున్న వారిని కూడా ఈ బ్లూటూత్ ద్వారా పనిచేసే రీసెంట్ కాంటాక్ట్‌లు ఆప్షన్ గుర్తిస్తుంది. దీని గురించిన వివరాలను ఆరోగ్యసేతు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతానికి ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్ యూజర్‌లకే అందుబాటులో ఉంది. త్వరలో యాప్ స్టోర్‌కు కూడా పొడిగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరో సదుపాయాన్ని కూడా ఆరోగ్య సేతు అప్‌డేట్ చేసింది. ఇప్పటివరకు ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు జియోఫోన్‌లలో ఉండే కైఓఎస్ స్టోర్‌లో కూడా దీన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చారు.