రాష్ట్రంలో ఒమిక్రాన్ ​తీవ్రత తక్కువే.. ఇవాల్టి కేసులెన్నంటే..?

by  |
corona
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతానికి ఒమిక్రాన్​తీవ్రత తక్కువేనని వైద్యారోగ్యశాఖ కేంద్రానికి వివరించింది. కేవలం 38 ఒమిక్రాన్​ కేసులు మాత్రమే ఉన్నాయని, ఇప్పటి వరకు ఒకరికి మినహా ప్రైమరీ కాంటాక్ట్​లో మరేవరిలోనూ కొత్త వేరియంట్​​నిర్ధారణ కాలేదన్నది. ఒమిక్రాన్​ తేలినోళ్లలో ఎవరికీ సీరియస్​ పరిస్థితి రాలేదని స్పష్టం చేసింది.

మరోవైపు కరోనా తీవ్రత కూడా తక్కువగానే ఉన్నట్లు వివరించింది. గత వారం రోజులుగా సగటున 0.48 పాజిటివిటీ మాత్రమే తేలుతున్నట్లు పేర్కొన్నది. ప్రస్తుతం అన్ని ఆసుపత్రుల్లో కరోనా ఇన్​పేషెంట్లుగా ప్రభుత్వం, ప్రైవేట్​లో కలిపి కేవలం 1197 మంది మాత్రమే ఉన్నట్లు వివరించింది. మరో 54,245 బెడ్లు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది.

కరోనా అప్​డేట్​..
కరోనా తెలంగాణ ఇండియా
కొత్తకేసులు 177 7,495
మొత్తం 6,80,251 3,47,74,361
మృతులు 4,018 4,79,023
ఒమిక్రాన్​ వేరియంట్​
కొత్తకేసులు 0
మొత్తం 38
మృతులు 0



Next Story

Most Viewed