- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్నాప్‌చాట్‌లో లెన్సెస్‌తో సమ్‌థింగ్ స్పెషల్
దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడూ ఒకటే తరహా హెయిర్ స్టైల్‌తో విసుగు చెందారా? లేదా కొత్త హెయిర్ స్టైల్‌లో మీరెలా ఉంటారో చూసుకోవాలనుందా? అందమైన ముఖానికి గడ్డం అడ్డుగా ఉందా? లేదా చార్మింగ్, క్లీన్ ఫేస్‌కు లైట్‌గా బియర్డ్ యాడ్ చేస్తే.. అదిరిపోతుందని అనిపిస్తుందా? అయితే స్నాప్ చాట్‌లో ఈ న్యూ ఫీచర్స్‌ను ట్రై చేస్తే సరిపోతుంది. తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘స్నాప్ చాట్’ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్లు యూజర్లకు పై విషయాల్లో కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి. ఎలానో మీరూ చూడండి.
స్మార్ట్ ఫోన్‌లో అగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్) సపోర్ట్ చేసే ఫీచర్ ఉంటే చాలు.. ఇలా ఏదైనా ట్రై చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (ఏఐ), వర్చువల్ రియాలిటీ(వీఆర్)ల కలయికతో వచ్చిందే ఈ ‘ఏఆర్’. టెక్ ప్రియులకు ఫోన్‌లోనే ఎన్నో అద్భుతాలను రియల్ వరల్డ్‌గా చూపిస్తూ మన ముందుంచేది ఈ ఏఆర్. స్నాప్ చాట్ ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని కొత్తగా రెండు ఏఆర్ లెన్స్‌లను తీసుకొచ్చింది. ఈ లెన్స్‌లను ఉపయోగించి బియర్డ్, బియర్డ్‌లెస్ ఫోటోలను దిగొచ్చు. ఎడిట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మనకు బియర్డ్ ఉంటే.. దాన్ని క్లీన్ షేవ్‌గా మార్చేయచ్చు. అదే క్లీన్ షేవ్ ఉంటే.. బియర్డ్‌ని జత చేయొచ్చు. ఇది ఓ ఎగ్జాంపుల్ మాత్రమే. యూజర్లు తమకు ఎలా కావాల్సి వస్తే.. అలా అందుబాటులో ఉన్నా టెక్నాలజీ ప్రకారం ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పటికే స్నాప్‌లో అందుబాటులో ఉన్న లెన్సెస్‌తో ఫేస్, బ్యాక్‌గ్రౌండ్, సౌండ్ వంటి వాటికి ఎఫెక్ట్స్ జతచేయొచ్చు.
స్నాప్‌చాట్ 2015లో లెన్సెస్‌ను తొలిగా ప్రవేశపెట్టింది. అప్పటినుంచి ఇప్పటివరకు లెన్స్ కలెక్షన్స్‌ను పెంచుతూ పోతోంది. తాజాగా బియర్డ్ లెన్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది.