నయన్ ‘‘నెట్రికారన్’’ లుక్‌కు అమేజింగ్ రెస్పాన్స్

by Jakkula Samataha |   ( Updated:2020-10-23 05:42:51.0  )
నయన్ ‘‘నెట్రికారన్’’ లుక్‌కు అమేజింగ్ రెస్పాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: విఘ్నేష్ శివన్ నిర్మాణ సారథ్యంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార కొత్త సినిమా ప్రారంభం అయింది. రౌడీ పిక్చర్స్ బ్యానర్ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘నెట్రికారన్’ టైటిల్ రివిల్ చేస్తూ ఫస్ట్ లుక్ షేర్ చేశాడు. మిలింద్ రావ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా పోస్టర్‌లో నయన్ రాడు పట్టుకుని ముఖం మీద రక్తంతో శత్రువును ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉండగా..ఇండస్ట్రీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

నయన్, శివన్ కాంబినేషన్‌కు అభినందనలు తెలుపుతున్న సెలెబ్రిటీస్..మరో థ్రిల్లర్ మూవీ బ్లాక్ బస్టర్ ఖాయమని అంటున్నారు. బాణాసంచా పేల్చేందుకు సిద్ధంగా ఉండాలని ఏకైక రౌడీ విఘ్నేష్‌కు కంగ్రాట్స్ చెప్పారు డైరెక్టర్ గౌతమ్ మీనన్. ప్రముఖుల స్పందనపై థాంక్స్ చెప్పాడు శివన్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని కోరుకున్నారు. కాగా, నయన్ శివన్ దర్శకత్వంలో ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో నటించబోతుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరో, సమంత అక్కినేని మరో కథానాయిక.

Advertisement

Next Story