- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆకాష్ పూరీని ఆడుకున్న నెటిజన్లు

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరీ.. బాలనటుడిగానే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఆ తర్వాత.. ఆంధ్రా పోరి, మెహబూబా సినిమాలతో హీరోగా పరిచయమైనా.. అంతగా మెప్పించలేకపోయాడు. ఇప్పటివరకు పూరీ కొడుకుగానే ఎక్కువగా పాపులరైన ఆకాష్ పూరీ.. త్వరలోనే ఫుల్ రొమాన్స్ నిండిన ‘రొమాంటిక్’ సినిమాతో రాబోతున్నాడు.
అయితే ఆకాష్ పూరీ.. తన పుట్టినరోజున ఎలాంటి సెలబ్రేషన్స్ చేయకూడదని ట్విట్టర్‌లో అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. కరోనా కారణంగా వేడుకలకు దూరంగా ఉండాలని కోరాడు. దీంతో హీరోను ఆడుకున్నారు నెటిజన్లు. ‘అన్నా.. నిజంగా బర్త్‌డే సెలబ్రేషన్స్ ఓ లెవల్‌లో ప్లాన్ చేశాం. కానీ నువు వద్దంటున్నావ్ కదా.. సరే నువు చెప్పినట్లే వింటాం కానీ, ఇంతకీ నీ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు’ అంటూ కామెంట్స్ చేశారు. ‘వెయ్యి కిలోమీటర్ల కేక్ ఆర్డర్ చేశాం.. ఫ్లెక్సీలు డిజైన్ చేయించాం… బైక్ ర్యాలీ, బ్లడ్ డొనేషన్ ప్లాన్ చేశాం కదా.. ఇప్పుడా నువు చెప్పేది.. మరీ ఓవర్‌గా లేదు’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
A humble request to all my fans. pic.twitter.com/4eHfbu8WGH
— Akash Puri (@ActorAkashPuri) July 23, 2020