- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JusticeForSanjuSamson.. బీసీసీఐపై నెటిజన్ల సంచలన ఆరోపణ
దిశ, వెబ్‌డెస్క్: సంజూ శాంసన్.. టీమిండియాలో ఇతడిది ప్రత్యేక స్థానం. ఐపీఎల్ సీజన్లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన సంజూకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా పెరిగారు. ఈ క్రమంలోనే అనతికాలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. కానీ, టీ20 వరల్డ్‌కప్‌లో బీసీసీఐ సంజూను ఎంపిక చేయలేదు. ఇక ఈ సిరీస్ నుంచి భారత్ నిష్ర్కమించిన అనంతరం న్యూజీలాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 17 నుంచి ఈ మ్యాచులు ప్రారంభం కాగా, మంగళవారం జట్టును ప్రకటించింది టీమిండియా.
ఇందులోనూ సంజూ శాంసన్ పేరు లేకపోవడంతో అతడి అభిమానులు ఫైర్ అవుతున్నారు. బీసీసీఐ టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం లేదంటూ సంచలన ఆరోపణ చేస్తున్నారు. #JusticeForSanjuSamson అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు పలువురు నెటిజన్లు ఇటీవల జరిగిన శ్రీలంక టూర్‌లో తన ప్రతిభను నిరూపించుకోలేక పోయాడని.. మరోసారి సెలెక్షన్ కమిటీ దృష్టిలో పడేలా ఫోకస్ చేయాలంటూ సూచనలు చేస్తున్నారు.