టైమంతా.. టిక్ టాక్ లోనే గడిపేస్తున్నారు.

by Sujitha Rachapalli |
టైమంతా.. టిక్ టాక్ లోనే గడిపేస్తున్నారు.
X

దిశ వెబ్ డెస్క్: కరోనా ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ప్రజలంతా ఇల్లకే పరిమితమయ్యారు. థియేటర్లు లేవు, సీరియళ్లు రావడం లేదు. మరి టైంపాస్ ఎలా అంటే.. మొబైల్ ఉంది కదా అంటున్నారు నెటిజన్లు. అయితే సోషల్ మీడియా వెబసైట్స్ లలో ఎక్కువగా జనాలు . . టిక్ టాక్ లోనే ఉంటున్నారు.

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలోని 200 దేశాలకు పాకి ప్రజలను వేధిస్తోంది. ఇప్పటికే లక్ష మంది ప్రజలు ఈ వ్యాధికి బలయ్యారు. ఈ నేపథ్యంలోనే చైనా ఉత్పత్తులన్నీ బ్యాన్ చేయాలనే కామెంట్లు బాగా వినబడుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ధోరణి పెరుగుతోంది. చైనా ఉత్పత్తులను నిషేధించాలనే వాదన మరోసారి తెరపైకి వస్తోంది. చైనా యాప్ అయిన టిక్ టాక్‌ను దేశంలో నిషేధించాలని కొందరు భారతీయ నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యాలు చేస్తున్నారు. అయితే ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువగా అందరూ గడుపుతున్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ టిక్ టాక్ అట.ఇక టిక్ టాక్‌కు ఉన్న కస్టమర్లలో సగం మంది భారతీయులే. లాక్ డౌన్ సమయంలో ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లలో ఇండియన్స్ ఎక్కువగా గడుపుతున్నారు. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 29 వరకు వచ్చిన గణాంకాల ప్రకారం టిక్‌టాక్, అసాధారణమైన రీతిలో దూసుకెళ్తుంది.

ఎంత సమయం ఉంటున్నారంటే:

భారతదేశంలో 800 మిలియన్లకు పైగా వినియోగదారులతో టిక్‌టాక్ దూసుకెళ్తుంది. టిక్ టాక్‌లో ఓ యూజర్ సగటు గడిపే సెషన్ సమయం 39.5 నిమిషాల నుండి 56.9 నిమిషాలకు పెరిగింది. లైవ్ వీడియో స్ట్రీమింగ్ సమయం కూడా బాగా పెరిగిపోయింది. Live.meలో గడిపిన సమయం కూడా 315% పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వరుసగా 59% మరియు 53% పెరిగాయి.

అలా వచ్చింది:

2016లో బైట్ డాన్స్ అనే చైనీస్ ఐటీ కంపెనీ టిక్‌‌ టాక్​ను ప్రారంభించింది. మ్యూజికల్లీ అనే యాప్‌‌ దానిలో విలీనమయ్యాక టిక్‌‌ టాక్‌‌ విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. 2018లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి అత్యధికంగా డౌన్​లోడ్​ అయిన యాప్​లలో టాప్​లో నిలిచింది. వాట్సాప్, ఫేస్‌‌బుక్, ఇన్‌‌స్టాగ్రామ్ పాపులారిటీని అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ వినియోగదారుల్లో 40 శాతం మంది ఇండియన్లే. ఈ క్రమంలోనే ఆ కంపెనీ మేనేజ్​మెంట్​ వచ్చే మూడేళ్లలో మన దేశంలో రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పింది

Tags: coronavirus, covid 19, lockdown, tiktok, users, social media, china

Advertisement

Next Story

Most Viewed