స్టార్ కిడ్స్‌పై నెటిజన్ల నెగెటివ్ కామెంట్స్

by Anukaran |
స్టార్ కిడ్స్‌పై నెటిజన్ల నెగెటివ్ కామెంట్స్
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా.. స్టార్ కిడ్స్.. ఈ రెండు పదాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ప్రత్యేకించి స్టార్ కిడ్స్ ‘సోషల్ మీడియాను’ ఉపయోగించుకుని ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటే.. అది పాజిటివ్‌గానా లేక నెగెటివ్‌గానా అనేది మాత్రం తనే డిసైడ్ చేస్తానంటోంది సోషల్ మీడియా. ఫొటో షూట్‌ల నుంచి బెడ్ రూమ్ విషయాల వరకు.. ఫ్యామిలీ మ్యాటర్స్ నుంచి పెట్స్ వరకు.. బ్రదర్ నుంచి బాయ్ ఫ్రెండ్స్ వరకు ఇలా అన్ని ఫొటోలను షేర్ చేసి, నెటిజన్లను అట్రాక్ట్ చేయాలనుకునే స్టార్ కిడ్స్ ఆలోచనలకు ట్రోల్స్ రూపంలో అపోజ్ చేస్తానంటోంది. ఫ్యూచర్‌ను బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసుకోవాలన్న వారి కలలను తుంచేసి.. అసలు ఫ్యూచరే లేకుండా చేస్తానని నెటిజన్ల రూపంలో కనిపించని శత్రువులను సృష్టిస్తోంది. నువ్వు ఫొటో పెడతావా.. నేను ట్రోల్ చేస్తా! క్వశ్చన్ చేస్తావా.. నీ క్యారెక్టర్‌నే టార్గెట్ చేస్తా! అన్నట్లు స్టార్ కిడ్స్‌పై దండయాత్ర చేస్తోంది ‘సోషల్ మీడియా’. అయితే ఇక్కడ తప్పంతా సోషల్ మీడియాదేనా? అంటే.. కానే కాదు. ఎందుకంటే వల్గారిటీ, బోల్డ్‌నెస్‌తో కూడిన ఫొటోలు షేర్ చేయడాన్ని స్టార్ కిడ్స్ ఓ గ్లామరస్ ఇమేజ్‌గా ఫీలవుతుంటారు. కానీ నెటిజన్లు అలా ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. కారణం వారి ప్రపంచం అది కాదు. అలాంటప్పుడు నెగెటివ్ కామెంట్స్ రావడం కామన్. ఈ నేపథ్యంలో స్టార్ కిడ్స్ పోస్ట్‌ల డోస్.. ఇటు సోషల్ మీడియా ట్రోల్స్ శ్రుతిమించితే ఏం జరుగుతుందనేదే ఇక్కడ టాపిక్.

ఆ కలర్ చూడు..

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌ ఈ తరహా ట్రోల్స్‌కు బాధితురాలే. ఏకంగా తన కలర్ మీదే అటాక్ చేశారు నెటిజన్లు. బ్రౌన్ కలర్ స్కిన్‌తో అందవిహీనంగా ఉందని తనను 12 ఏళ్ల వయసు నుంచి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎదిగే పిల్లలపై ఇలాంటి కామెంట్స్ ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలియంది కాదు. ఒక రకంగా అమ్మాయిలో ఇన్‌ఫీరియారిటీ, ఇన్‌సెక్యూరిటీ పెంచిన వాళ్లమవుతాం. ఇవి మానసిక అనారోగ్యానికి కూడా దారితీస్తాయి. అయినా ఆ అమ్మాయి అందానికి కొలతలు పెట్టే హక్కు మనకు ఉందా? అసలు అమ్మాయి అందంగా ఉందా? లేదా? అని ‘స్కిన్ టోన్, హైట్, వెయిట్, హెయిర్’.. ఎలా డిసైడ్ చేస్తాయి? ఇంతలా కామెంట్స్ చేస్తున్నవారు.. ఏ కొలమానంతో తాము అందంగా ఉన్నామని అనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించి కామెంట్ చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ విషయంలో తప్పకుండా నెటిజన్లను తప్పు పట్టాల్సిన అవసరముంది.

శ్రీదేవి కూతురివేనా?

అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ ఇప్పుడిప్పుడే ఎదుగుతుండగా.. స్టార్‌గా పరిచయం అయ్యేందుకు ఇంకాస్త టైమ్ పడుతుంది. కాగా ఇప్పటికే సినిమాలు చేస్తున్న పెద్ద కూతురు జాన్వీ కపూర్.. అందంగానూ ఉండటంతో తల్లిలాగా స్టార్ అయ్యే అవకాశాలున్నాయిని అర్థమవుతోంది. కానీ ఖుషీ ఇంకా గ్రోన్‌అప్ గర్ల్ కాబట్టి.. అంత బ్యూటిఫుల్‌గా కనిపించకపోవచ్చు. అలాంటి అమ్మాయిని తల్లితో, అక్కతో పోలుస్తూ.. వారిలాగా అందంగా లేవని హేళన చేయడం ఎంత వరకు కరెక్ట్? 19 ఏళ్లు కూడా నిండని అమ్మాయిపై ఈ తరహా కామెంట్స్.. మానసిక ఒత్తిడిని కలిగిస్తాయా? లేదా? స్టార్ అవుదామనుకున్న తనను నిరాశతో కుంగిపోయేలా చేస్తాయా? లేదా? జస్ట్ థింక్.

టిట్ ఫర్ ట్యాట్.. రేటెంత?

ప్రముఖ దర్శకులు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్యే అండర్‌వేర్ ఫొటోలతో నెట్టింట హల్‌చల్ చేసిన ఈ స్టార్ కిడ్‌.. ఆ విధంగా అయినా ప్రజలకు గుర్తుండిపోవాలి అనుకుందో ఏమో కానీ.. ఒకటి కాదు రెండు కాదు, వరుసగా అలాంటి ఫొటో షూట్‌లే చేస్తూ అర్ధనగ్నంగా లోదుస్తులతో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఓ బ్రాండ్‌ను ప్రమోట్ చేసే క్రమంలో తను ఇలా చేసినా.. నెటిజన్లకు అది నచ్చలేదు. వేశ్యగా అభివర్ణించారు. రేటు ఎంత? అని అడిగారు. గ్యాంగ్ రేప్ చేస్తామని భయపెట్టారు. భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేస్తున్న తనను చంపేస్తామని బెదిరించారు. ఇంత ఘోరమైన కామెంట్స్ ఎదుర్కోలేని స్టార్ కిడ్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఆ తర్వాత రియలైజ్ అయి నెగెటివ్ కామెంట్స్ చేసేవారిని బ్లాక్ చేసి, కాస్త ఉపశమనం పొందుతోంది.

ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఒకటి స్టార్ కిడ్ కదా.. బ్రాండ్ అంబాసిడర్‌గా బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకుంది. అది తన పర్సనల్ వర్క్. కానీ మరీ అలాంటి ఫొటోలను వరుసగా షేర్ చేసి చిరాకు తెప్పించడం మాత్రం తప్పే. ఇలా హద్దుమీరిన ఆలియాకు నెటిజన్ల నుంచి కూడా హద్దుమీరిన ట్రోల్స్ వచ్చాయి. కానీ అవి మనిషిని సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ వరకు తీసుకెళ్లడమే బాధ కలిగించే విషయం.

పోర్న్ రెడీ

హాట్ హీరోయిన్ పూజా బేడీ కూతురు అలయా ఫర్నీచర్‌వాలా. ‘జవానీ జానేమన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. అంతకు ముందు ఘోరమైన ట్రోల్స్ ఎదుర్కొంది. కారణం ఫొటోల్లో క్లీవేజ్ షో. తల్లి హాట్ కాబట్టి కూతురు మరో మెట్టు ఎక్కి సూపర్ హాట్‌గా కనిపించింది. బోల్డ్‌గా కనిపిస్తూ రెచ్చిపోయింది. దీంతో నెటిజన్ల కామెంట్స్ అన్నీ నెగెటివిటీతో నిండిపోయాయి. బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నావా? లేక పోర్న్ వీడియోలు చేసేందుకు ప్రిపేర్ అవుతున్నావా? అంటూ కామెంట్ చేశారు. వీటిపై ఘాటుగానే స్పందించింది అలయ. ‘నేను నా బ్రెస్ట్‌ను మించి ఉన్నా.. వక్షోజాల ఆధారంగా తనను నిర్వచించడం అన్యాయం’ అని సమాధానమిచ్చింది.

ఇక్కడ కూడా పెంపకం, పెరిగిన వాతావరణం స్టార్ కిడ్‌పై ఎఫెక్ట్ చూపించాయి. అందుకేనేమో బోల్డ్‌గా కనిపించడంలో తప్పులేదని ఫీల్ అయింది అలయ. కానీ ఆ పరిస్థితుల గురించి కామెంట్స్ చేసేవాళ్లకు తెలియదు. క్లీవేజ్ షో, బోల్డ్ పిక్స్.. ఇండియన్ కల్చర్‌కు వ్యతిరేకం కాబట్టి ఆటోమేటిక్‌గా నెటిజన్లు ఫైర్ కావడంలోనూ తప్పు లేదు.

ఎవరితో తిరుగుతుందో..

రూమర్డ్ బాయ్ ఫ్రెండ్స్/ గర్ల్ ఫ్రెండ్స్.. ఇది గ్లామర్ ప్రపంచంలో కామన్. రిలేషన్‌షిప్, డేటింగ్ అనేది బయట కూడా నార్మల్ అయిపోయింది. స్టార్ కిడ్‌ బాయ్ ఫ్రెండ్ అంటా.. ఎక్కడ తిరుగుతుందో? ఏం చేస్తుందో? అంటూ సోషల్ మీడియాలో పచ్చిబూతులు తిడుతుంటారు. వారి మీద మీడియా అటెన్షన్ ఉంది కాబట్టి.. ఆ రిలేషన్ ఏంటో బయటపడింది. ఒకవేళ కామెంట్ చేసే వాళ్ల మీద కాన్సంట్రేట్ చేస్తే ఎలా తిరుగుతున్నారో అర్థం కాదా ఏంటి? ట్రోల్స్ చేసేవాళ్లు బాయ్ ఫ్రెండ్/గర్ల్ ఫ్రెండ్‌తో తిరగట్లేదని చెప్పగలరా?

ఈ విషయాలన్నీ పక్కనబెడితే ఫిల్మ్ స్టార్స్, సెలబ్రిటీ కిడ్స్‌ లైఫ్‌స్టైల్‌పై మీడియాతో పాటు నెటిజన్లు కూడా అటెన్షన్ తగ్గించుకుంటేనే మంచిది. అదే టైమ్‌లో స్టార్ కిడ్స్ సైతం రంగుల ప్రపంచంలో తమకున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా, పరిమితులకు లోబడి నడుచుకుంటేనే స్టార్ వారసులుగా తమకు కూడా సొసైటీలో గౌరవం లభించే అవకాశం ఉంటుంది.

Advertisement

Next Story