ప్రణబ్ కృషిని ఎప్పటికీ గుర్తుచేసుకుంటాం : నేపాల్ ప్రధాని

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ, అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఆయన మరణ వార్త తెలిసిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి స్పందిస్తూ… నేపాల్ గొప్ప స్నేహితుడిని కోల్పోయిందన్నారు. భారత్, నేపాల్ మధ్య సంబంధాల బలోపేతానికి ప్రణబ్ చేసిన కృషిని తాము ఎప్పటికీ గుర్తుచేసుకుంటామని చెప్పారు. ఆయన మరణవార్త తనను బాధకు గురిచేసిందని ఓలి అన్నారు. భారతీయులకు, ప్రణబ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతునట్టు ట్వీట్ చేశారు.

 

Advertisement