భారతీయుల కోసం ఐడీ కార్డు విధానం : నేపాల్

by  |
భారతీయుల కోసం ఐడీ కార్డు విధానం : నేపాల్
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయుల కోసం ఐడీ కార్డు విధానం తీసుకు రానున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా తమ దేశంలో కరోనా వ్యాప్తి చెందడానికి ఇండియన్స్ కారణమని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చాలా సందర్భాల్లో వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే తమ దేశంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు అమలు చేస్తున్నట్లు నేపాల్ హోంమంత్రి రామ్ బహదూర్ థాపా తెలిపారు. ఇకమీదట భారత్ నుంచి నేపాల్‌లో అడుగుపెట్టేవారిని తమ గుర్తింపు కార్డులు చూపించాల్సిందని కోరనున్నట్లు స్పష్టంచేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన పార్లమెంటరీ ప్యానెల్‌కు వివరించారు.

హోంమంత్రి బహదూర్ మాట్లాడుతూ.. ప్రజల రాకపోకలు, కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన సమాచారం శాశ్వతంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గుర్తింపు కార్డుల జారీ, రిజిస్ట్రేషన్ సిస్టమ్ వంటివాటిని అమలు చేస్తామన్నారు. ఈ సమాచారం మెరుగైన రీతిలో నమోదయ్యేలా చూస్తామన్నారు.

ఇప్పటివరకు భారతీయులు నేపాల్‌లోకి నిరంతరంగా ఎటువంటి కండిషన్స్ లేకుండా రాకపోకలు సాగిస్తున్నారు. ఐడీకార్డుల విధానాన్ని నేపాల్ ప్రభుత్వం తీసుకొస్తే ఈ రెండు దేశాల మధ్య రాకపోకలపై కట్టుదిట్టమైన ఆంక్షలు అమలవ్వనున్నాయి.



Next Story

Most Viewed